విశాఖపట్నం జిల్లా (విశాఖ తూర్పు)
నేను పిలిచింది విజయసాయిని… ఆయనొస్తే ప్రమాణం చేస్తా
విజయసాయిరెడ్డికి సవాలు విసిరితే మధ్యలో.. వేరే నాయకులు ఎందుకు వస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే, శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు ప్రశ్నించారు.
– విజయసాయిరెడ్డి స్వయంగా వస్తే ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు.
– ఎంతో నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నాని వెలగపూడి పునరుద్ఘాటించారు.
★ విజయసాయిరెడ్డి స్వయంగా వస్తే ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పష్టం చేశారు.
★ ప్రమాణాల సవాళ్ల నేపథ్యంలో విశాఖ జల్లా ఎంవీపీ కాలనీలోని తెదేపా కార్యాలయానికి వెళ్లారు.
★ తాను విజయసాయిరెడ్డికి సవాల్ విసిరానని.. మిగతా వాళ్లకి కాదని తెలిపారు.
★ సింహాచలం వచ్చి ప్రమాణం చేయాలన్న వైకాపా నేతల సవాలును స్వీకరిస్తున్నామని వెలగపూడి అన్నారు.
★ విజయసాయిరెడ్డి సింహాచలం వస్తారా అని ప్రశ్నించారు.
★ విశాఖలోని ప్రశాంత వాతావరణం చెడగొట్టొద్దని సూచించారు.
★ భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఎమ్మెల్యే వెలగపూడిపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయగా.. తనపై చేసిన ఆరోపణలపై సాయిబాబా గుడిలో ప్రమాణం చేయాలని వెలగపూడి సవాల్ విసిరారు.