Wednesday, March 3, 2021

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శ్రీ నారా లోకేష్ లేఖ…

అమరావతి (విశాఖ స్టీల్ ప్లాంట్)

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్ లేఖ…

28 మంది వైకాపా ఎంపీలు ఉండి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో విఫలమయ్యారు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు.

★ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారు.

★ 28 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి కనీస కేటాయింపులు సాధించలేకపోయారు.

★ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం విస్మయానికి గురిచేసింది.

★ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాష్ట్ర ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్ ని పోరాడి సాధించుకున్నారు.

★ ఎంతో మంది త్యాగాల ప్రతిఫలం విశాఖ స్టీల్ ప్లాంట్.

★ సుమారుగా 40 వేలమంది ప్రత్యక్షంగానూ, లక్షలాదిమంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారు.

★ 2000 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో సంప్రదింపులు చేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాడారు.

★ ఛత్తీస్ ఘడ్ లోని నాగర్నార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కొనుగోలు చెయ్యడానికి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది.

★ అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందంటూ
అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాదిమందికి భరోసా కల్పించాలి.

★ ఇంత పెద్ద ఉక్కు ఫ్యాక్టరీకి సొంత కాప్టివ్ ఐరన్ ఓర్ ఖనిజ వ్యవస్థ లేకపోవడం వలనే నష్టాలు వస్తున్నాయి.

★ కాబట్టి వెంటనే సొంత ఐరన్ మైన్ ని కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చెయ్యాలి.

★ 2032 కి దేశంలోనే అతి పెద్ద స్టీల్ ఉత్పత్తి చేసే కంపెనీగా ఎదుగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం రాష్ట్రానికి ఎంతో అవసరమని, ఎంతో మంది త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ని స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టొద్దని లేఖలో లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles