Tuesday, March 9, 2021

వైకాపా బెదిరింపులతో కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి – ట్విట్టర్ లో నారా లోకేష్ ఎద్దేవా

అమరావతి

వైకాపా బెదిరింపులతో కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి

రాష్ట్రంలోని కంపెనీలు సీఎం జగన్​కు బైబై చెప్పేస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.

– జగన్ మొహం చూసి ఒక్క కంపెనీ రాకపోగా..ఉన్న కంపెనీలు సైతం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని విమర్శించారు.

★ రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలు సీఎం జగన్​కు బైబై చెప్పేస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.

★ విధ్వంసం, వైకాపా నాయకుల బెదిరింపుల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన వారు, కంపెనీలు ఏర్పాటు చేసినవారు భయంతో పారిపోతున్నారన్నారు.

★ జగన్ మొహం చూసి ఒక్క కంపెనీ రాకపోగా..ఉన్న కంపెనీలు సైతం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని విమర్శించారు.

★ సీఎం జగన్ నిర్లక్ష్యధోరణి నిరుద్యోగులకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

★ విశాఖలో పదిహేనేళ్ల క్రితం ఏర్పాటై.. 3 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్​ఎస్​బీసీ కంపెనీ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోతుందన్నారు.

★ అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ట్విట్టర్​ వేదికగా దుయ్యబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles