రాయితీ కోసం రేషన్ కు గుడ్ బై చెప్పిన రాష్ట్ర సర్కారు వ్యూహాత్మక ఎత్తుగడ……… రాష్ట్ర టిడిపి కార్యదర్శి గాజుల ఖాదర్ భాషా.
December 14, 2020
వ్యూహాత్మక ఎత్తుగడలతో రాయితీ కోసం వైసీపీ ప్రభుత్వం రేషన్ కు గుడ్ బై చెప్పిందని రాష్ట్ర టిడిపి కార్యదర్శి గాజుల ఖాదర్ భాషా తీవ్రంగా దుయ్యబట్టారు.
సోమవారం నాడు పార్టీ టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
రేషన్ కార్డులో ఏరివేతను ప్రారంభించిన వైసీపీ ప్రభుత్వం అందులోనూ నిధులు ఆదా చేసే ప్రణాళికలు పక్కాగా అమలు చేసిందన్నారు.
జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోని కార్డులను తొలగిస్తే రాష్ట్రానికి వచ్చే కేంద్రం రాయితీ పోతుందని భావించిన ప్రభుత్వం ఏకంగా రాష్ట్రంలోని లబ్ధిదారుల కార్డులను భారీగా తొలగించడం జరిగిందన్నారు.
దాని కారణంగా కేంద్రం నుండి వచ్చే రాయితీ ఢోకా లేకుండా ఈ ప్రభుత్వం చేసుకుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో ఒకసారి 8.43 లక్షల రేషన్ కార్డులు తొలగించడం జరిగిందన్నారు.
ఆహార భద్రత చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 5 కిలోల చొప్పున 30 రూపాయలు కేంద్రం రాయితీ ఇస్తుందన్నారు.
దీనికి సుమారు ఐదు రూపాల అదనంగా కలిపి రాష్ట్రం పేదలకు బియ్యం ఇస్తున్నారన్నారు. అది ఆహార భద్రత చట్టం తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కార్డులు అయితే కిలో 35 రూపాయలు మొత్తం రాష్ట్రమే భరించాలి అన్నారు. దీని ప్రకారం గా రాష్ట్రం ఇస్తున్న కార్డులను భారీగా తొలగించడం జరిగిందన్నారు.
కేంద్రం ఇస్తున్న కార్డులను స్వల్పంగా తగ్గించడం జరిగిందన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆదా ప్రణాళిక ఖజానాకు భారీగా నిధులు మిగులుస్తుందన్నారు. దీనితో పాటుగా కందిపప్పు మరియు పంచదార రాయితీని కూడా కలిపితే నెలకు సర్కార్కు 50 కోట్లు ఆదా అవుతుందన్నారు.
రేషన్ డోర్ డెలివరీ కోసం కొనుగోలు చేస్తున్న వాహనాలు కోసం 530 కోట్లు వేచిస్తుందని, కార్డుల తొలగింపుతో ప్రభుత్వానికి మిగిలే నిధులు వాహనాలు కొనుగోలుకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం అన్నారు.
వాహనాలు కొనుగోలు కూడా వైసీపీ నాయకులు వాటాలతో ప్రజల సొమ్మును గండి కొడుతూ భుజిస్తున్నారన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మనసు మార్చుకుని పేదల కడుపు కొట్టకుండా రేషన్ కార్డులు తొలగింపు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు నర్సారెడ్డి, సంబేపల్లి మండల అధ్యక్షులు రెడ్డేయ్య యాదవ్, వెంకట రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.