Tuesday, March 2, 2021

శ్రీ ఏలూరి సాంబశివరావు పత్రికా ప్రకటన

ప్రకాశం జిల్లా (పర్చూరు)

బాపట్ల పార్లిమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు, శాసనసభ్యులు, శ్రీ ఏలూరి సాంబశివరావు పత్రికా ప్రకటన వివరాలు..

నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లిస్తామని చెప్పే ధైర్యం మంత్రి కన్నబాబుకు ఉందా?

★ 18నెలల వైకాపా పాలనలో 7 ప్రకృతి విపత్తులతో 40లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే పరిహారం ఎంత చెల్లించారో మంత్రి కన్నబాబు రైతులకు సమాధానం చెప్పాలి.

★ రైతులకు సంకెళ్లు వేయటమే వైకాపా చేసిన రైతు సంక్షేమా!.

★ ధ్యానం కొనుగోలు గురించి మాట్లాడినందుకు నెల్లూరులో దళిత రైతు జైపాల్ ను అక్రమంగా అరెస్ట్ చేసిన చరిత్ర మీది కాదా?

★ మంత్రి కన్నబాబు చెబుతున్నది ఒకటి క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది మరోకటి.

★ 50శాతం పంట నష్టపోయిన కూడా లెక్కింపులోకి తీసుకోవడం లేదు.

★ ఏ రైతు నష్టపోకుండా టీడీపీ హయాంలో పరిహారం అందిస్తే.. నేడు రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

★ వ్యవసాయ బిల్లుపై మంత్రి నోరు ఎందుకు మెదపడం లేదు?.

★ పార్లమెంట్ లో వ్యవసాయ బిల్లును గుడ్డిగా అమోదించింది వైకాపా ఎంపీలు కాదా?

★ అసెంబ్లీలో టీడీపీ నిలదీసిన తరువాతే అర్ధరాత్రి జీవో ఇచ్చి భీమా ప్రీమియం చెల్లించిన విషయం మంత్రి మర్చిపోయినా రైతులు మర్చిపోరు.

★ నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పే ధైర్యం కన్నబాబుకు ఉందా?

★ ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి వరదలతో నష్టపోయిన రైతులను అదుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles