అమరావతి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..
నిష్పక్షపాత ఎన్నికలంటే గెలవలేమని జగన్ కు భయమా…!
– అనుకూల కమీషనర్ కోసం తాపత్రయపడటం అంటే ఎన్నికల ఫలితాల తారుమారు కోసం కాదా?
– కోర్టును తప్పుడు సమాచారం ఇచ్చి రద్దు చేయించుకున్నంత మాత్రానా ప్రజాభిప్రాయం మారుతుందా?
★ జగన్ రెడ్డికి ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంటే ఎన్నికలకు వెళ్లెందుకు ఎందుకు భయపడుతున్నారు?
★ నిష్పక్షపాత ఎన్నికల నిర్వహిస్తుంటే వైకాపాకు భయమెందుకు?
★ ఎన్నికల షెడ్యూల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును మేం గౌరవిస్తున్నాం.
★ కానీ, వైకాపా ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి సింగిల్ జడ్జి కోర్టులో ఎన్నికల షెడ్యూల్ ను తాత్కాలికంగా అడ్డుకున్నారు.
★ కరోనా ఉన్న సమయంలో ఎన్నికలు కావాలని అడిగిన జగన్ కరోనా లేనప్పుడు ఎన్నికలు ఎందుకు వద్దంటున్నాడు?
★ నిజంగా కరోనా ఉంటే నెల్లూరు లో అమ్మఓడి సభను వేలాదిమందితో ఎందుకు నిర్వహించారు?
★ పశ్చిమ గోదావరిలో ఇళ్లపట్టాల కార్యక్రమం వేలాది మందితో నిర్వహించి ఇద్దరు మహిళల మరణానికి ఎందుకు కారకులయ్యారు?
★ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ చేసిన తర్వాత, తిరుపతి ఎన్నికల తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళుతామని ఉత్తరాంధ్ర విజయసాయి రెడ్డి ఎలా చెబుతారు?
★ ఉద్యోగ సంఘాలను కూడా కుట్రలో భాగస్వాములను చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు.
★ ప్రస్థుత ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ఆద్వర్యంలో ఎన్నికలు జరిగితే వైకాపా అరాచక చర్యలు, ఎన్నికల ఫలితాలు తారుమారు సాగవని భయపడుతున్నారు.
★ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాకోర్టులో ఓడిపోతామని జగన్ కు భయంపుట్టుకుంది.
