Wednesday, March 3, 2021

శ్రీ కిమిడి కళా వెంకట్రావ్ పత్రికా ప్రకటన

అమరావతి/శ్రీకాకుళం జిల్లా

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, శ్రీ కిమిడి కళా వెంకట్రావ్ పత్రికా ప్రకటన వివరాలు..

మూడు రాజధానులతో ఏపీ భవిత ప్రశ్నార్థకం

– 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటారా?

– రాజధాని తరలింపు నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి వెనక్కు తీసుకోవాలి

– మొండిగా ముందుకెళ్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు

★ అమరావతిని పురిటిలోనే సమాధి చేయాలనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ ప్రజల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది.

★ అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ 365 రోజులుగా రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం స్పందిచకపోవడం దుర్మార్గం.

★ నేరస్థుడు పాలకుడైతే ఆ రాజ్యం ఎంత అస్తవ్యస్థంగా ఉంటుందో అందుకు ఆంధ్ర రాష్ట్రమే ఉదాహరణ.

★ దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతికి మరణశాసనం రాయడం శోచనీయం.

★ అమరావతి అంటే కేవలం రాజధాని మాత్రమే కాదు.

★ లక్ష కోట్ల సంపద సృష్టికి కేంద్రం.

★ రైతుల వెలకట్టలేని త్యాగం.

★ విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి… ప్రాణసమానమైన భూములుచ్చి అమరావతి రూపంలో రైతులు ప్రాణం పోశారు.

★ తమ త్యాగంతో భావితరాలకు స్పూర్తిదాయకంగా నిలిచారు.

★ కానీ వ్యక్తిగత ద్వేషం, ధనదాహంతో అమరావతిని జగన్ రెడ్డి చంపేస్తున్నారు.

★ అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ప్రతిపక్షనేతగా స్వాగతించిన జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలు ఏం సరిపోతుంది… ఇంకా ఎక్కువ భూమి కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.

★ అధికారంలోకి వచ్చాక మాట తప్పి ప్రజలను దారుణంగా మోసం చేశారు.

★ రైతులను నిండా ముంచారు.

★ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు త్యాగధనులు అని చెప్పిన వైసీపీ నేతల కళ్లకు అధికారంలోకి రాగానే అదే రైతులు పెయిడ్ ఆర్టీస్టులుగా ఎలా కనపడుతున్నారు.?

★ ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వ లేదు. అయినా అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ భారీ ప్రకటనలు చేస్తున్నారు.

★ భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని గత ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పేవారు.

★ నాడు పాదాభివందనాలు అందుకున్న రైతులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈసడింపులకు గురవుతున్నారు.

★ అధికార మదంతో రాజధాని రైతులకు సంకెళ్లు వేశారు.

★ మహిళా రైతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

★ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఆందోళన చేస్తున్న రైతులకు న్యాయం చేస్తానని ఎందుకు హామీ ఇవ్వడం లేదు?

★ పైపెచ్చు మూడు రాజధానులు కావాలంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారితో పోటీ ధర్నాలు ఎందుకు చేయిస్తున్నారు?

★ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తూ పోతే పెట్టుబడిదారులు ముందుకు వస్తారా?

★ అమరావతి అనేది కొన్ని గ్రామాలకే పరిమితం అనే ముఖ్యమంత్రి ఆలోచన సరికాదు.

★ కల్పతరువులాంటి అమరావతి పూర్తయితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

★ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది.

★ రాజధాని మార్చబోమని ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.

★ నాకేంటని విర్రవీగిన నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి.

★ తక్షణమే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.

★ లేని పక్షంలో ప్రజాగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గురికాకతప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles