శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడి గారి విలేకరుల సమావేశం వివరాలు
ఆర్టీసీ భూములకు ఎసరు పెట్టిన జగన్
• ఆర్టీసీ సంస్థకు చెందిన 1300 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి జగన్ సిద్ధమయ్యాడు.• గతంలో టీడీపీ ప్రభుత్వం 33ఏళ్లపాటు లీజుకు ఇస్తే, దాన్ని తప్పుపట్టిన జగన్, నేడు 50ఏళ్లపాటు లీజుకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. • విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి నగరాల్లోని రూ.1500కోట్ల విలువచేసే ఆర్టీసీ స్థలాలు 50ఏళ్లపాటుప్రైవేట్ వ్యక్తులస్వాధీనంలో ఉంటే, తిరిగి సంస్థ స్వాధీనం అవుతాయా?• లీజుదారులు కోర్టులకు వెళ్లి, ఏళ్లకు ఏళ్లు భూములను అనుభవించడాన్ని ఇప్పటికీ చూస్తున్నాం.• ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, అధికారులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. • ఆర్టీసీ, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వారికి అప్పగించడం వల్ల తలెత్తే సమస్యలను ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి. *శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు*(టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు మరియు మాజీమంత్రి)ముఖ్యమంత్రి పనులన్నీ తుగ్లక్ చర్యలను మించిపోతు న్నాయని, దేవాదాయ, ప్రభుత్వ భూములను అమ్ముకుంటు న్నారని, వాటితో పేదల స్వాధీనంలో ఉన్నభూములను, మాన్సాస్ ట్రస్ట్ భూములను కూడా వదల్లేదని, వీటన్నింటిపై ప్రజలు, ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నా, నిరసనవ్యక్తంచేస్తున్నా రాష్ట్ర తుగ్లక్ పట్టించుకోవడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. శుక్రవారం ఆయన తనసందేశాన్ని వీడియోరూపంలో విలేకరులకు పంపిం చారు. పేదలభూములు సహా వేటినీ వదలని, జగన్ ప్రభుత్వం, నేడు ఆర్టీసీ సంస్థకు చెందిన స్థలాలను కూడా అమ్మడానికి సిద్ధమైందన్నారు. ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తున్నా, సదరు సంస్థకు చెందిన ఉద్యోగులు, అధికారులు ప్రశ్నించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని పలుపట్టణాల్లో ఆర్టీసీ సంస్థకు చెందిన సుమారు 1300ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడా నికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడన్నారు. గతంలో ఆర్టీసీసంస్థకు చెందిన స్థలాలను చంద్రబాబు ప్రభుత్వం 33ఏళ్లకు లీజుకు ఇవ్వడాన్ని తప్పుపట్టిన జగన్మోహన్ రెడ్డి, నేడు 50ఏళ్లకు ఇచ్చేలా లీజుఒప్పందాలకు సిద్ధపడటం ఏమిటని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, ఇతరఅధికారులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాలన్నారు. విశాఖపట్నంలోని మర్రిపాలెంలో 6ఎకరాలను, తిరుపతిలో 13 ఎకరాలను, కృష్ణాజిల్లాలోని హనుమాన్ జంక్షన్లో 1.7ఎకరాలను, విజయవాడ ఆటోనగర్ లోని 2ఎకరాలు, కర్నూలులోని 2ఎకరాలను ప్రైవేట్ వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఆయా భూముల విలువసుమారు రూ.1500 కోట్లు ఉంటుందని, అంతవిలువైనభూములను షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణంపేరుతో 50ఏళ్లపాటు లీజుకిఇవ్వడం దారుణ మన్నారు. 50 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉన్నభూములు తిరిగి ప్రభుత్వానికి ఎలా వస్తాయో పాలకులే సమాధానం చెప్పాలన్నా రు. లీజు కాలం ముగియగానే, స్థలం అనుభవదారులు కోర్టులకు వెళ్లి, తిరిగి లీజుహక్కులు పొందుతారన్నారు. గతంలో 50ఏళ్ల క్రితం సింహాచలంలో పెట్రోల్ బంకు నిర్మాణానికి దేవాదాయ భూములిస్తే, అవి ఇంతవరకు భూహక్కుదారుల పరంకాలేదని అయ్యన్న తెలిపారు. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయని, కోర్టుల్లో ఏళ్లతరబడి భూవివాదాలు సాగుతూనే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు ఆయన్ని నిలదీయలేకపోతున్నారన్నారు. నర్సీపట్నంలో గతంలో ఇదేవిధంగా ఆర్టీసీస్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చూస్తే, తానే అడ్డుకోవడం జరిగిందని అయ్యన్నపాత్రుడు తెలిపారు. అధికారపార్టీకి చెందిన నేతలు, తక్షణమే ముఖ్యమంత్రిని కలిసి, ఆర్టీసీ స్థలాల లీజు నిర్ణయం వెనక్కు తీసుకునేలా ఆయనపై ఒత్తిడితేవాలని టీడీపీనేత సూచించారు.