Thursday, February 25, 2021

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పత్రికా ప్రకటన

అమరావతి

టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..

అమరావతి జేఏసీ 6 రోజుల ఆందోళనలు విజయవంతం చేయాలి

– ఏడాదిగా పట్టువీడకుండా అమరావతి రైతులు, రైతుకూలీల పోరాటం ఒక చరిత్ర

– రాజధాని రైతులు, రైతు కూలీలు, మహిళలకు సంఫీుభావం చూపాలి

– టెలికాన్ఫరెన్స్‌ లో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు పిలుపు

★ అమరావతి ఆందోళనలు ఏడాది అవుతున్న సందర్భంగా టీడీపీ నాయకులు, శ్రేణులతో తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

👉 ఈ టెలికాన్ఫరెన్స్‌ లో చంద్రబాబు మాట్లాడుతూ…

★ రాజధాని అమరావతి పరిరక్షణ ఆందోళనలు ఏడాది సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు 6 రోజులు నిరసన కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలి.

★ రేపు గుంటూరులో మహా పాదయాత్ర, 14న తుళ్లూరులో కిసాన్‌ సమ్మేళనం, 15న విజయవాడలో పాదయాత్ర, 17న ఉద్దండరాయనిపాలెంలో బహిరంగ సభను విజయవంతం చేయాలి.

★ 13 జిల్లాల ప్రజా ప్రయోజనాల కోసం రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాల భూములను అందజేసిన రైతులు, రైతు కూలీలు, మహిళల త్యాగాలు వృధా కారాదు.

★ రాజధాని శంకుస్థాపన సందర్భంగా 13 వేల గ్రామాలు, 3 వేల వార్డుల ప్రజానీకం ఏ విధంగా సంఫీుభావం చూపారో అదే స్ఫూర్తిని ఇప్పుడు కూడా చూపాలి.

★ ఎన్నో వేధింపులను తట్టుకుని ఏడాదిగా రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు రాజీలేని పోరాటం చేస్తున్నారు.

★ తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలను తట్టుకుని పట్టువదలకుండా ఏడాదిగా ఆందోళనలను కొనసాగించడం ఒక చరిత్ర.

★ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించి ఉంటే 13 జిల్లాలకు రూ.2 లక్షల కోట్ల సంపద సమకూరేది.

★ అన్ని జిల్లాల యువతకు ఉపాధి వచ్చేది.

★ ఇప్పుడు అంతా నాశనం చేశారు.

★ పెట్టుబడులను తరిమేశారు.

★ ఉపాధి అవకాశాలను తుంగలో తొక్కారు.

★ విశాఖలో విచ్చవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారు.

★ బెదిరింపులు, వేధింపులు, సెటిల్‌మెంట్లతో భయాందోళలను సృష్టిస్తున్నారు.

★ కరోనా సమయంలో కర్నూలును ఏవిధంగా గాలికి వదిలేశారో అందరూ చూశారు.

★ అన్ని రంగాల్లో వైసిపి ఘోరంగా విఫలం అయ్యింది.

★ అమరావతిని ఏ విధంగా ధ్వంసం చేశారో, అభివృద్ధిని నిలిపేశారో ప్రజలకు వివరించాలి.

★ ప్రతి ఒక్కరిలో చైతన్యం పెంచాలి. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై దృఢ సంకల్పంతో పోరాడాలి.

★ అమరావతి రైతులు, రైతు కూలీల పోరాటానికి రాష్ట్రం అంతా సంఫీుభావంగా నిలబడాలి.

★ జెఏసి పిలుపుమేరకు రేపటినుంచి 6రోజుల ఆందోళనల్లో అందరూ భాగస్వాములు కావాలి అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles