కృష్ణ జిల్లా (గన్నవరం)
గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, జాతీయ టీడీపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, శాసనమండలి సభ్యులు, శ్రీ బచ్చుల అర్జునుడు పత్రిక ప్రకటన వివరాలు..
యువతది బాధ్యతాయుత పాత్ర
– పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఇస్తాం
– యువత సమావేశంలో గన్నవరం ఇన్చార్జి బచ్చుల అర్జునుడు
★ తెలుగుదేశం పార్టీలో యువత బాధ్యతాయుతంగా పని చేయాలని పార్టీ గన్నవరం నియోజకవర్గం ఇన్చార్జి, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు అన్నారు.
★ పార్టీకి యువత రెండు కళ్లు లాంటివారని చెప్పారు.
★ కష్టపడి పని చేసే వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు ఇవ్వడంతోపాటు పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.
★ తెలుగు యువత గన్నవరం నియోజకవర్గ స్థాయి సమావేశం గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగింది.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ..
★ టీడీపీలో మొదటి నుంచి యువతకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు.
★ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల ప్రకారం నాయకులు, యువత సమన్వయంతో కలసి పని చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందన్నారు.
★ గ్రామాలలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా యువకులు ముందడుగు వేయాలని సూచించారు.
★ యువత చక్కని ఆలోచనా విధానంలో సక్రమమార్గంలో నడవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
★ రాష్ట్రంలో నేడు వ్యవస్థపై ముప్పేట దాడి జరుగుతోందని, వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
★ సాధ్యమైనంత త్వరగా సంస్థాగత ఎన్నికలను పూర్తిచేసుకుని క్షేత్రస్థాయిలో పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని అర్జునుడు పిలుపునిచ్చారు.
ముఖ్య అతిధిగా హాజరైన గన్నవరం నియోజకవర్గం పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ..
★ రాష్ట్రంలో ప్రస్తుత పాలనను చూసి యువత అధైర్యపడొద్దని, త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు.
★ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
★ రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందన్నారు.
★ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని, అందుకే అనేక రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించుకున్నట్లు చెప్పారు.
★ ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా పేరు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా అడ్డుపడుతోందని విమర్శించారు.
★ రాష్ట్రంలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినందునే ఎన్నికలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా మాట్లాడుతూ..
★ యువతే పార్టీకి పునాదులని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లి వివరించాలన్నారు.
★ గ్రామాలలో పార్టీని అభివృద్ధి చేసే బాధ్యతలను యువతే స్వీకరించాలని ఆయన కోరారు.
★ ఈ సమావేశంలో టీడీపీ గన్నవరం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ కోనేరు నాగేంద్రకుమార్(నాని), తెదేపా నాయకుడు బొడ్డపాటి రాంబాబు, తెలుగు యువత గన్నవరం మండల అధ్యక్షుడు చీమలదండు రామకృష్ణ, విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు గంపా శ్రీనివాస యాదవ్, తెలుగు యువత నాయకుడు మండవ అన్వేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.