కృష్ణ జిల్లా (గన్నవరం)
గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, జాతీయ టీడీపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, శాసనమండలి సభ్యులు, శ్రీ బచ్చుల అర్జునుడు పత్రికా ప్రకటన వివరాలు..
‘స్థానిక’ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయండి
– అన్ని చోట్లా నామినేషన్లు వేయించాలి
– ఐదేసి గ్రామాలకు ఇన్చార్జులుగా సీనియర్లు
– మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఎమ్మెల్సీ బచ్చుల
★ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గం ఇన్చార్జి బచ్చుల అర్జునుడు సూచించారు.
★ నియోజకవర్గంలోని 84 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులతోపాటు అన్ని వార్డు పదవులకు అభ్యర్థులతో నామినేషన్లు వేయించేలా చూడాలన్నారు.
★ గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యూహాంపై విజయవాడ రూరల్, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు శనివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్జునుడు మాటాడుతూ..
★ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో తెలుగుదేశం పార్టీ బలంగానే ఉందన్నారు.
★ రాష్ట్రంలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనతో ప్రజలు విసిగి చెందుతున్నారని.
★ ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడంతో పాటు అన్ని పదవులకు నామినేషన్లు వేయించి, అందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
★ ఇదే అంశంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో జూమ్ యాప్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు.
★ గన్నవరం నియోజకవర్గంలో ఐదేసి గ్రామాలకు ఇన్చార్జులుగా సీనియర్లను నియమించనున్నట్లు తెలిపారు.
★ ఆయా గ్రామాలలో అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు, ప్రచార బాధ్యతలను సీనియర్ నేతలు పర్యవేక్షిస్తారని చెప్పారు.
★ మండలంలోని అన్ని గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పార్టీ మండల అధ్యకులు, ప్రధాన కార్యదర్శులు పర్యవేక్షించాలని సూచించారు.
★ గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని, గ్రామాలలో ఉన్న నాయకులు ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను స్వీకరించి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆర్జునుడు కోరారు.
★ ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా, గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి, ఉంగుటూరు మండల అధ్యక్షుడు డాక్టర్ ఆరుమళ్ల కృష్ణారెడ్డి, విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు గొడ్డళ్ల చిన రామారావు, బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్ తదితరులు పాల్గొన్నారు.