Monday, March 8, 2021

శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, శ్రీ కాలవ శ్రీనివాసులు లేఖ

అమరావతి/అనంతపురం జిల్లా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, శ్రీ కాలవ శ్రీనివాసులు లేఖ

అనంతపురము జిల్లాలో 2020 ఖరీఫ్ లో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా అందించుట గురించి.

★ అనంతపురము జిల్లాలో ప్రతియేటా ఏదో ఒక కారణంగా రైతులు పంటలు సష్టపోతూనే ఉన్నారు.

★ అనావృష్టికి ఆలవాలమై నిత్య కరువులకు నిలయమై నిలిచిన ఈ జిల్లాలో ఈసారి అకాల, అధిక వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి.

★ సాధారణంగా పంటలు సష్టపోయినప్పుడు రైతులు సాయం కోసం ప్రభుత్వంవైపు ఆశగా చూస్తారు.

★ పంట నష్టాలను సకాలంలో లెక్కించి ప్రభుత్వానికి అధికారులు నివేదించడం పరిపాటి.

★ ఈసారి పంట కోత ప్రయోగాల ఫలితాలు లక్షలాది రైతుల్లో తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి.

★ జిల్లాలోని 63 మండలాల్లో కేవలం 33 మండలాలే ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారానికి అర్హత సాధించిన విషయం తాజాగా వెలుగు చూసింది.

★ ఇటీవలి పంట కోత ప్రయోగాల్లో హెక్టారుకు 545 కేజీల కన్నా తక్కువ దిగుబడి వచ్చిన మండలాలనే పంట వష్టవరిహారానికి అర్హమైనవిగా ఎంపిక చేయడం వల్ల 30 మండలాల రైతుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

★ జిల్లా అంతటా రైతులు సుమారు 13 లక్షల ఎకరాల్లో వేరుశెనగను సాగు చేశారు.

★ అందులో 10 లక్షల ఎకరాల్లోని పంట సెప్టెంబర్ నాటికే దెబ్బతినింది.

★ పంట ఏపుగా పెరిగినా చెట్టుకు రెండు మూడు కాయలు కూడా లేని పరిస్థితి.

★ సెప్టెంబర్ – అక్టోబర్లో కురిసిన వర్షాలు చేతికందిన పంటనుకూడా కుళ్ళిపోయేలా చేశాయి.

★ ఫలితంగా ముందెన్నడూ లేని లేనంత ఎక్కువగా జిల్లాలో పంట నష్టం వాటిల్లింది.

★ సాంకేతిక నిబంధనలే ప్రామాణికంగా సాగిన పంట కోత ప్రయోగాలపై సరైన పర్యవేక్షణ లేని కారణంగా వాటి ఫలితాలు వాస్తవ నష్టాలను ప్రతిఫలించలేదు.

★ దీంతో పంట దిగుబడులు దారుణంగా పడిపోయిన 30 మండలాల రైతులకు ప్రభుత్వ మిచ్చే పంట నష్టపరిహారం జాబితాలో చోటు దక్కని పరిస్థితి నేలకొనింది.

★ తాము తీస్తున్న లెక్కలు ఆయా మండలాల్లో సంభవించిన పంట నష్టాలను ప్రతిఫలిస్తున్నాయా? లేదా? అన్నది అధికారులు చూసుకోలేదు ప్రజాప్రతినిధులు వాటిపై అసలే శ్రద్ధ పెట్టలేదు.

★ ఫలితంగా సుమారు 3 లక్షల మంది పంటలు సష్టపోయిన రైతులకు నిబంధనల మేరకు ప్రభుత్వ సహాయం అందే అవకాశం లేకుండా పోయింది.

★ అనంతపురము పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో డి.హీరేహాల్, బొమ్మనహాల్, రాయదుర్గం, కంబదూరు, వజ్రకరూరు, విడపనకల్లు, కూడేరు, గుంతకల్లు తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు, శింగనమల, యల్లనూరు, గార్లదిన్నె మండలాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అందే అవకాశం లేదు.

★ అలాగే హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గుడిబండ, ఆగలి, మడకశిర, రోళ్ళ, సోమందేపల్లి, పెనుకొండ, ఓడి చెరువు, అమడగురు, సంబులపూ లకుంట, తలుపుల, నల్లచెరువు తనకల్లు, ఆత్మకూరు, కనగానపల్లి మండలాల్లో పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

★ వీటిలో హెక్టారుకు 455 కేజీల కన్నా ఎక్కువ వేరుశేనగ దిగుబడి లభించినట్లు ప్రభుత్వం లెక్కలు వేయడం ఈ జిల్లా రైతును దారుణంగా మోసం చేయడమే అవుతుంది.

★ ముందెన్నడూ లేనంతగా ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో రైతులు వేరుశెనగను సాగు చేశారు.

★ ఖరీఫ్ ప్రారంభంలో ఆశాజనంగా వర్షాలు కురవడంతోపాటు, గత ఏడాది ఉన్నంతలో పంట దిగుబడులు బాగానే రావడం వల్ల ఎన్నో ఆశలతో అప్పులు చేసి మరీ విత్తనం వేశారు.

★ కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు చాలా కంపెనీలు కల్పించడం వల్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్లతో పాటు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డ జిల్లా రైతు కుటుంబాల పిల్లలు ఏప్రిల్ నుంచి స్వగ్రామాల్లోనే ఉంటున్నారు.

★ వారు కష్టపడి సంపాదించుకున్న సోమ్మును కూడా వారి సొంత పొలాల్లో పెట్టుబడుల క్రింద వెచ్చించి పంట నష్టపోయి చేతులు కాల్చుకున్నారు.

★ రైతులకు పంట కోత ప్రయోగాల వల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దేందుకు జిల్లా వైకాపా ప్రజాప్రతినిధులు ఆసెంబ్లీ సమావేశాల సందర్భంలో మీ దృష్టికి తీసుకొస్తారేమోనని ఎదురుచూశం, కాని వారెవరూ అలాంటి ప్రయత్నం చేసినట్లు లేదు.

★ అసెంబ్లీ లోపల లేదా బయట మీతో సహా మంత్రులు, శాసనసభ్యులు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం జిల్లా రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. నిబంధనలు సహకరించకపోయినా పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పరిహారం ప్రకటించే అవకాశం ఉంటుంది.

★ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం కొన్నింటిని కరువు మండలాలుగా ప్రకటించే అవకాశం లేకపోయినా, రాష్ట్ర ప్రభుత్వమే అలాంటి వాటిని పంటలు సష్టఫోయిన ప్రాంతాలుగా గుర్తించి ఇపుట్ సబ్సిడీని అందించి ఆదుకున్న సందర్భాలున్నాయి.

★ ఇప్పుడు కూడా జిల్లాలోని 63 మండలాలను వంట నష్టపోయిన ప్రాంతాలుగా త క్షణం ప్రకటించాల్సిన అవసరం ఉంది.

★ ప్రభుత్వం కేవలం 33 మండలాల్లోని పంటలు నష్టపోయిన రైతుల వివరాలను మాత్రమే సేకరిస్తున్నట్లు శుక్రవారం కణేకల్లులో విలేకరులతో మాట్లాడిన వ్యవసాయ శాఖ జాయింట్ డైరక్టర్ సృష్టం చేయడంతో మిగిలిన 30 మండలాల రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది.

★ కాబట్టి వెంటనే జిల్లా అంతటా పంట సష్టం అంచనాల వివరాలను సేకరించేందుకు అధికారులకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

★ సోమవారం లోగా ఈ విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాల్సి ఉంటుంది.

★ రైతు పేరు చెప్పుకొని అధికారంలోకొచ్చిన మీరు రైతులకు అడుగడుగునా అన్యాయం చేస్తుండటం క్షమించరాని నేరం.

★ జిల్లా రైతులపట్ల మీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం చూస్తూ ఊరుకోబోదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం.

★ ప్రభుత్వ పరిహారానికి నోచుకోని 30 మండలాల బాధిత రైతులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలకు పూనుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నాము.

★ ఈ ప్రభుత్వాధినేతగా మీ తక్షణ స్పందన కోసం వేచి చూస్తుంటాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles