Tuesday, March 2, 2021

సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ కండ్లగుంట్ల మధుబాబు నాయుడు టీడీపీలో చేరిక

అమరావతి/నెల్లూరు జిల్లా

తెలుగుదేశం పార్టీలో లోకేష్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ నాయకుడు చేరారు.

★ ప్రతిపక్ష పార్టీల నాయకులంతా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న తరుణంలో శుక్రవారం తెలుగు దేశం పార్టీలో జోష్ నిండింది.

వైసీపీ నాయకుడు, సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ కండ్లగుంట్ల మధుబాబు నాయుడు టీడీపీలో చేరారు.

★ శుక్రవారం అమరావతిలో మధుబాబుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

★ అనంతరం మధుబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసి ఆశీస్సులు అందుకున్నారు.

★ ఈ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు, మాలేపాటి సుబ్బానాయుడు, మల్లిశెట్టి వెంకటేశ్వర్లు, మన్నవ రవిచంద్ర, బొట్లగుంట శ్రీహరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

★ టీడీపీలో చేరిన వారిలో కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరులు కూడా ఉన్నారు.

★ ఇది ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.

★ అలాగే వైసీపీ నేతల చేరికలు నారా లోకేష్‌లో ఫుల్ జోష్ నింపింది.

★ ఈ మేరకు లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.

★ రాష్ట్రంలో మార్పు మొదలైందని, వైసీపీ నుంచి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారని చెప్పారు.

★ ‘‘రాష్ట్రంలో మార్పు మెల్లగా” మొదలవుతోంది.

★ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా అసమ్మతి తెలుపుతున్నారు.

★ ఈరోజు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గ వైకాపా నేత కర్లగుంట మధుబాబు నాయుడు గారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను.

★ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరాను.

★ ప్రజా సమస్యలపై పోరాటానికి ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చాను…అని లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles