స్నేహలత కుటుంబాన్ని పరామర్శించిన శింగనమల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణి శ్రీ గారు~~~~~~~
మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం
– పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే ఉన్మాదుల చేతిలో స్నేహలత బలైపోయింది
★ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం మహిళల పాలిట శాపంగా మారింది.
★ ప్రభుత్వ ఉదాసీనత కారణంగా రాష్ట్రంలో ప్రేమోన్మాదులు పేట్రేగిపోతున్నారు.
★ అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రేమోన్మాదుల చేతిలో దళిత యువతి స్నేహలత బలైపోవడం ఎంతో కలిచివేసింది.
★ వేధింపులపై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి అఘాయిత్యం జరిగింది.
★ ఘటన జరిగి 24 గంటలు గడిచినా ప్రభుత్వం కానీ పోలీసులు కాని ఎందుకు స్పందించలేదు?
★ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు.
★ రెండు రోజుల క్రితం ఇదే అనంతపురం జిల్లాలో ముక్కుపచ్చలారని బాలికను లారీ డ్రైవర్ అత్యాచారం చేస్తే ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు.
★ మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు?
★ మహిళా హోంమంత్రి ఎక్కడున్నారు?
★ రాష్ట్రంలో మహిళా కమీషన్ పనిచేస్తోందా?
★ స్నేహలతను దారుణంగా హతమార్చిన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.
★ స్నేహలత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి.
★ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని శింగనమల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణి శ్రీ గారు డిమాండ్ చేసారు.
స్నేహలత మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణి శ్రీ గారు, నార్పల మాజీ ఎంపీపీ ఉమాపతి నాయుడు, మాజీ జడ్పీటీసీ విశాలాక్షి, తెలుగుయువత జిల్లా అధ్యక్షులు గడుపుటి నారాయణస్వామి, శింగనమల జడ్పీటీసీ అభ్యర్థి చిదానంద నాయుడు, శింగనమల మండల కన్వినర్ ఆదినారాయణ, జీసీ రామానాయుడు,గుర్రం లక్ష్మినారాయణ, బాబా ఫక్రుద్దీన్ వలి, టోపి భాష తదితరులు పాల్గొన్నారు

