Sunday, March 7, 2021

స్నేహలత మృతదేహానికి నివాళులు అర్పించిన అనంతపురం పార్లమెంటరీ టీడీపీ ఇంచార్జ్ శ్రీ జేసీ పవన్ రెడ్డి

అనంతపురం జిల్లా (ధర్మవరం)

ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన స్నేహలత మృతదేహానికి నివాళులు అర్పించిన అనంతపురం పార్లమెంటరీ టీడీపీ ఇంచార్జ్, శ్రీ జేసీ పవన్ రెడ్డి

★ అనంతపురం నగరానికి చెందిన స్టేట్ బ్యాంక్ పొరుగు సేవల ఉద్యోగి స్నేహలత ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే.

★ అశోక్ నగర్ లో ఉన్న స్నేహలత ఇంటికి వెళ్లి మృత దేహానికి అనంతపురం పార్లమెంటరీ టీడీపీ ఇంచార్జ్ జేసీ పవన్ రెడ్డి నివాళులు అర్పించారు.

★ కుటుంబ సభ్యులను పరామర్శించిన జేసీ పవన్ రెడ్డి వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

★ నిందితులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని పవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

★ రాష్ట్రంలో దళితుల పట్ల అమానుష సంఘటనలు తరచూ చోటు చేసుకున్న, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆయన ఘాటుగా విమర్శించారు.

★ ముఖ్యంగా దళిత మహిళల పట్ల అత్యాచారాలు హత్యలు తరచూ చోటు చేసుకుంటున్న, ప్రభుత్వం నుండి సరైన స్పందన లేకపోవడం విచారకరమన్నారు.

★ స్నేహాలత ఘటన విషయంలో పోలీసుల అలసత్వం వైఖరిని ఆయన తప్పు పట్టారు.

★ జేసీ పవన్ రెడ్డి వెంట స్థానిక తెలుగుదేశం నాయకులు, మాజీ టౌన్ బ్యాంకు అధ్యక్షుడు జేఎల్ మురళి, రాయల్ మురళి, మాజీ టీడీపీ నగర అధ్యక్షుడు కృష్ణకుమార్,
మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి, లక్ష్మినాయుడమ్మ వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles