Thursday, February 25, 2021

45 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో జనాదరణ పొందినటువంటి పోరాట యోధులు రాజేంద్ర ప్రసాద్ గారు

45 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో జనాదరణ పొందినటువంటి పోరాట యోధులు రాజేంద్ర ప్రసాద్ గారు – తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారు

నేను రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నా కూడా నా ఉయ్యూరు ప్రజలకు వారి సొంత బిడ్డనేఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్

ఉయ్యూరు మున్సిపాల్టీ 1వార్డులో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు రాజకీయంగా సిల్వర్ జూబ్లీ పూర్తిచేసుకున్న సందర్భంగా 1 వార్డ్ ప్రజలకు ఇంటింటికి ( సిల్వర్ జూబ్లీ ) చిరు కానుక ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కొల్లు రవీంద్ర గారు గారు.

ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ముందుగా రాజేంద్ర ప్రసాద్ గార్కి శుభాకాంక్షలు అని, 1995 లో ఉయ్యూరు ప్రజలు ఆయన్ని ఇండిపెండెంట్ సర్పంచ్ గా గెలిపించడం వలనే ఆయన సర్పంచుల సంఘo పెట్టి అప్పటి ముఖ్య మంత్రులుగా ఉన్న నారా చంద్రబాబు గారు, తదుపరి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గార్ల మీద కూడా ఉద్యమాలు చేసి సర్పంచ్ లకు చెక్ పవర్ తెప్పించారని, తరువాత ఎంపీటీసీలకు గౌరవ వేతనం ఇప్పించారని . ఇలా అనేక పోరాటాలు చేసి గ్రామాల అభివృద్ధి కి ఎన్నో ప్రభుత్వ జీవోలు సాధించారని రవీంద్ర గారు అన్నారు . రాజేంద్ర ప్రసాద్ గారు మాతో అప్పుడప్పుడు అంటుంటారు నేను చేసే ఉద్యమాలు కానివ్వండి, పోరాటాలు కానివ్వండి, నేను ఈ రాజకీయంగా స్థాయిలో ఉన్నానంటే అది నా ఉయ్యూరు ప్రజలు నాకు పెట్టిన రాజకీయ బిక్షేనని అంటుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల, నాయకుల ఆదరణ పొందిన నాయకుడు ఎక్కిన తొలి మెట్టు మరువకుండా నా ఉయ్యూరు ప్రజల వల్లే ఇదంతా సాధ్యపడిందని అంటుంటే అది విని మేము కూడా మా రాజకీయ తొలి మెట్టుని గుర్తుచేసుకుంటున్నామని . రాజేంద్ర ప్రసాద్ గారి నిబద్దత, సేవా సంకల్పం గల నాయకుడు ఉయ్యూరులో మీ మధ్య ఉండటం మీకు, అలాగే ఆయన్ని సొంత బిడ్డలాగా ఆదరించే ఉయ్యూరు ప్రజలు లాంటి వాళ్ళు ఆయనకి అండగా ఉండటం రాజేంద్ర ప్రసాద్ గార్కి శుభ సూచకం లాగా భావిస్తూ, ఆయన రాజకీయంగా మరిన్ని పదవులు అధిరోహించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు రవీంద్ర గారు అన్నారు.

రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ నాగన్న గూడెం, యెగిన పాడు కి నేను సర్పంచ్ గా వున్నప్పుడు వంతెన నిర్మించానని, రోడ్లు వేయించి,వాటర్ ట్యాంక్ నిర్మించి, మంచి నీటి పైపు లైన్లు వేయించానని, ఇదంతా ఆనాడు మీరు నన్ను కుల మతాలకు అతీతంగా ఓట్లు వేసి సర్పంచ్ గా గెలిపించడం వలనే ఉయ్యూరు ని అభివృద్ధి చెయ్యడం సాధ్యపడిందని, నాకు ఎల్లప్పుడూ అండగా ఉన్న నా ఉయ్యూరు ప్రజల ఋణం తీర్చుకోలేనిదని రాజేంద్ర ప్రసాద్ అన్నారు

ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వీరంకి గురుమూర్తి గారు, మండల యువత అధ్యక్షులు చౌదరి,1 కౌన్సిలర్ అభ్యర్థి గుంజా లక్ష్మణ్ రావ్,1 వార్డ్ తెదేపా అధ్యక్షులు గోరంట్ల నరేంద్ర , పేరేపి నరేష్, శివరాం,మోటూరి ఫణేంద్ర, నాగేంద్ర, అజయ్, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles