అమరావతి
ప్రాధాన్యమున్న పదవులన్నీ సీఎం సామాజిక వర్గానికే
ప్రతిపక్షంలో ఉండగా బీసీలకు పెద్దపీట అంటూ హామీలిచ్చిన వైకాపా.. అధికారంలోకి వచ్చాక ద్రోహం చేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
– ప్రాధాన్యం ఉన్న పదవులను ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి ఇస్తూ నామమాత్రపు పదవులు బీసీలకు ఇచ్చారని ఆరోపించారు.
– ఈ మేరకు ఓ జాబితా విడుదల చేశారు.
★ పదవుల కేటాయింపుల్లో బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ జాబితాను విడుదల చేశారు.
★ బడుగులకు 50 శాతం నామినేటెడ్ పదవుల పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
★ ఉపకులపతులు, తిరుమల తిరుపతి దేవస్థానం, సలహాదార్లలో బీసీలకు అన్యాయం జరిగింది.
★ జగన్ రెడ్డి కొండంత ప్రచారం చేసుకుంటూ గోరంత కూడా సాయం చేయలేదు.
★ ప్రతిపక్షంలో ఉండగా బీసీలకు పెద్దపీట అంటూ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారు.
★ అధికారంలోకి వచ్చాక కత్తి వేటు వేస్తూ ద్రోహం చేశారు. ప్రాధాన్యం ఉన్న పదవులు సొంత సామాజికవర్గానికి ఇస్తూ నామమాత్రపు పదవులు మాత్రమే బీసీలకు ఇచ్చారు.
★ 50 శాతం జనాభా ఉన్న బీసీలు నామినేటెడ్ పదవులకు పనికిరారా?.
★ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లు ఉత్సవ విగ్రహాలే.
★ నేతి బీరకాయలో నెయ్యి లేనట్లే కార్పొరేషన్లకు నిధులు లేవు.