ఆంధ్ర రాష్ట్రం విడిపోయి, కట్టు బట్టలతో రాజధాని లేకుండా బయటకు పంపివేయబడ్డ ఆంధ్రులంతా కలిసి ఒక పెద్ద దిక్కుగా చంద్రన్న అయితే రాష్ట్రాన్ని ఒక గాటిలో పెట్టగలడనే నమ్మకముతో పట్టాన్ని కట్టపెట్టారు. 2014 చంద్రబాబుగారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రజాభిప్రాయం మేరకు అమరావాతిని రాజధానిగా నిర్ణయించగా అసెంబ్లీ, శాసన మండలిలో అన్ని పార్టీలు అమరావతిని ప్రజా రాజధానిగా ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ప్రత్యేకించి అప్పటి ప్రతిపక్ష నాయకుడుగారు రాజధాని రాష్ట్రం నడిబొడ్డులో ఉండాలని, 30వేల ఎకారాలు ఉండాలని చెప్పారు. శివరామకృష్ణన్ కమీషన్ రాష్ట్ర వ్యాప్తముగా సేకరించిన ప్రజాభిప్రాయంలో కూడా అత్యధికులు అమరావతికే మొగ్గుచూపారు.
రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడి గారు 22.10.2015న ఉద్దండరాయునిపాలెం లో శంకుస్తాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. రాష్ట్రపతి రాజముద్రతో హై కోర్టు ఏర్పడింది. దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేష్ రాజధానిగా అమరావతి చిత్రింపబడింది.అసెంబ్లీ, మండలి, సచివాలయంతో పాటు అనేక కార్యలయాలు నిర్మింపబడాయి. రైతులిచ్చిన భూములద్వారా వచ్చే నిధులతోనే అమరావతి ప్రపంచస్తాయి నగరంగా తీర్చిదిద్దవచ్చు.ఇప్పటికే 29 గ్రామాలలో ఇళ్ళులేని పేదలకు 5024 ప్లాట్లు నిర్మించారు.సీడ్ యాక్సెస్ రోడ్డులో పాటు 34 రోడ్ల నిర్మాణం జరిగింది.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉద్యోగుల గృహసముదాయాలు 70% పైనే పూర్తయ్యాయి. విట్, ఎస్.ఆర్.ఎం, అమృత యూనివర్సిటీలు, ఎన్.ఐడి, ఎయింస్ అమరావతిలో నెలకొల్పబడి పనిచేస్తున్నాయి.
2019 సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో అసలు కధ మొదలైంది.
17.12.2019న జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలియచేస్తున్నారు. ఎంతోమంది రైతులు బలిదానం చేశారు. ఈ ఉద్యమం ఇప్పటికే 410 రోజులు సమీపిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం లాగా ఉంది. దేవుడు కరుణించి రైతుల ఆక్రందలను, గోడును పట్టించుకుని జగన్ రెడ్డి మనసు మారైనా, కేంద్రం ముందుకు వచ్చైనా, కోర్టులో జగన్ కు ఎదురు దెబ్బ తగిలైనా అమరావతి కొనసాగాలని మనసారా కోరుకుందాం.