Tuesday, October 19, 2021

జూ. ఎన్.టీ.ఆర్. ని ప్రచారానికి తీసుకురావాలని తెలుగు తమ్ముళ్ళ డిమాండ్ కు చంద్రబాబు మౌనం వెనుక అంతరార్దం ఏమిటి ?

నిన్న చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని శాంతిపురం లో జరిగిన రోడ్ షో సందర్బముగా తెలుగు తమ్ముళ్ళు బాహాటంగా జూ. ఎన్.టీ.ఆర్. ని ప్రచారానికి తీసుకురావాలని నినాదాలు చేశారు.చంద్రబాబు పర్యటన సందర్బముగా  వెలిసిన బ్యానర్లులో కూడా జూ. ఎన్.టీ.ఆర్.ఫోటో ఉండటం గమనార్హం. అయితే అకస్మాత్తుగా ఈ నినాదాల్ని విన్న చంద్రబాబు మాత్రం ఏమి మాట్లాడకుండా ఉండిపోయారు.

2019 శాసనసభ ఎన్నికలలో ఘోరపరాజయాన్ని చవిచూసిన తెలుగుదేశం మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ ప్రస్తుత వై.సి.పి.ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటు విమర్శలు చేస్తూ రాటుదేలి “మన లోకేష్ మాస్ లోకేష్ – ఊర మాస్” అనిపించుకుంటున్నాడు. గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఎక్కడ కార్యకర్తకి అన్యాయం జరిగినా వెంటనే వారిని సందర్శించి, ఒదార్చి, నేనున్నాను అని భరోసా కల్పిస్తున్నాడు. గత కొద్ది నెలల క్రితం వచ్చిన వర్షాలు వరదల సమయంలో రైతుల పరామర్శకు ప్రభుత్వం తరుపున వచ్చిన వారు ఎవరు లేరు కాని, ప్రతిపక్షం తరపున అన్నిచోట్ల తిరిగి రైతులకు ఆసరాగా నిలిచాడు.

అయితే ఇలాంటి సందర్బములో జూ. ఎన్.టీ.ఆర్.ని పార్టీ ప్రచారానికి రావాలని కార్యకర్తలు కోరటంలో అసలు ఉద్దేశ్యం ఏమిటి ? దీని వెనుక అధికార పార్టీ వై.సి.పి పాత్ర ఎమైనా ఉందా ? తెలుగుదేశం లో గ్రూపు రాజాకీయాలకు ఆజ్యం పోయాలనే ఉద్దేశ్యంతో కొంతమంది అధికార పార్టి వాళ్ళు తెలుగు తమ్ముళ్ళ పేరుతో నినాదాలు చేశారా ?

ఏది ఏమయిన ఇంతకముందు జూ. ఎన్.టీ.ఆర్. “తన తాత స్తాపించిన పార్టీలో తాను ఎప్పుడు ఉన్నట్లే అని, దానికోసం తాను ఎప్పుడూ పనిచేస్తానని” చెప్పిన మాటలను గుర్తుచేసుకుందాము.  

తెలుగుదేశం పార్టీ అందరిని కలుపుకుని మరింత ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుందాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

518FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles