






చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు
రెండు తెలుగు రాష్ట్రాలు, దేశ విదేశాల్లోని క్రైస్తవ సోదర, సోదరీమణులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
కరుణామయుడు, లోక రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రపంచ మానవాళి శ్రేయస్సును కాంక్షించారు. కరుణ, దయ, శాంతి, సహనం, ప్రేమ, సోదరభావం కలిగి ఉండాలని ప్రబోధించారు.
పొరుగువారిని ప్రేమించడం ఆదరించడమే క్రీస్తు తత్వం. అసూయా ద్వేషాలు, కక్షా కార్పణ్యాలకు తావులేనిదే క్రైస్తవం. హింసా విధ్వంసాలకు పాల్పడేవాళ్లు క్రీస్తు కృపకు పాత్రులు కాలేరు.
క్రైస్తవ సోదరుల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ 38ఏళ్లుగా కృషి చేస్తోంది. ప్రతి పేద కుటుంబం ఆనందంగా క్రిస్మస్ జరుపుకోడానికే ప్రతి ఏటా క్రిస్మస్ కానుక పంపిణీ చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక క్రిస్మస్ కానుకలు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, బీమా పథకాలన్నీ నిలిపేయడం బాధాకరం.
టిడిపి హయాంలో రూ 16కోట్లతో గుంటూరులో క్రిస్టియన్ భవన్ నిర్మాణం, చర్చిల మరమ్మతులు, ప్రార్ధనా మందిరాల నిర్మాణం, అనేక వినూత్న పథకాలను అమలు చేశాం. రూ250కోట్ల బడ్జెట్ తో అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం.
అలాంటిది గత 19నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దమనకాండ జరగడం శోచనీయం. బలహీన వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు పేట్రేగిపోవడం దురదృష్టకరం. సమాజంలో శాంతి, సమాధానం లోపించడం క్రీస్తు మార్గానికి వ్యతిరేకం.
ఈ క్రిస్మస్ పండుగ రాష్ట్రంలో అందరికీ శుభాలు కలుగజేయాలని, అసూయా ద్వేషాలు, కక్ష సాధింపు చర్యలు లేని శాంతి సౌభ్రాతృత్వాల సమాజం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నాను.
(నారా చంద్రబాబు నాయుడు)
Telugu Desam Party (TDP)
Nara Chandrababu Naidu