Tuesday, March 2, 2021

అమరావతి రాజధాని రైతులకు రోజురోజుకీ పెరుగుతున్న మద్దతు – సంపూర్ణ మద్దతు తెలియజేసిన అమెరికాలోని ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ విభాగం

అమరావతి/అమెరికా

అమరావతి రాజధాని రైతులకు రోజురోజుకీ పెరుగుతున్న మద్దతు

సంపూర్ణ మద్దతు తెలియజేసిన అమెరికాలోని ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ విభాగం

– తానా మాజీ అధ్యక్షులు, శ్రీ కోమటి జయరాం, శ్రీ వేమన సతీష్ మిత్రబృందం తరుపున అమరావతి రాజధాని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

★ అమరావతి మహోద్యమం మొదలయ్యి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా అకుంఠిత దీక్షతో, పట్టుదలతో ఈ ఉద్యమంలో పాల్గొంటున్న పెద్దలను, వృద్ధులను శుక్రవారం రోజున శాలువలతో సన్మానించి పాద పూజతో పాటు పచ్చ కండువాలు పంచుతూ అమరావతి ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులకు, రైతులకు సంతాపం తెలియచేయాలని అమెరికాలోని ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ విభాగం, తానా మాజీ అధ్యక్షులు, శ్రీ కోమటి జయరాం, శ్రీ వేమన సతీష్ వారు సంకల్పించారు.

★ ఈ బృహ‌త్త‌ర‌మైన కార్యక్రమ బాధ్యతను తెలుగు మహిళ నాయకురాలు, శ్రీమతి మూల్పూరి సాయి కల్యాణి మరియు అమరావతి యువజన జేఏసీ కన్వీనర్, శ్రీ రావిపాటి సాయి కృష్ణకి అప్పగించారు.

★ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉద్దండరాయనిపాలెం, తుళ్లూరు, అనంతవరం, దొండపాడు, బోరుపాలెం, రాయవుడి, తదితర గ్రామాల్లో అమరావతి ఉద్యమంలో అమరులైన రైతులకు, ఉద్యమకారులకు సంతాపం తెలియచేస్తూ, పెద్దలను శాలువలతో సన్మానించి పాద పూజ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో అమరావతి ఉద్యమాన్ని ప్రతిబింబించే ఉద్యమకారులు పవిత్రంగా భావించే ఆకుపచ్చ రంగు కండువాలు సుమారు 2 వేల వరకు పలు దీక్షా శిబిరాల్లో పంచడం జరిగింది.

ఈ సందర్బంగా అమరావతి రైతులు భవోద్యానికి లోనవుతు మాజీ తానా అధ్యక్షులు శ్రీ కోమటి జయరాం, శ్రీ సతీష్ వేమన మిత్రబృందానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

★ అలాగే, తాము చేస్తున్న ఉద్యమానికి స్వయంగా విచ్చేసి మద్దత్తు తెలపవలసిందిగా కోరారు.

★ నిన్నటితో అమరావతి ఉద్యమం సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా జరిగిన ‘జయభేరి’ సభలో టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు ప్రసంగాలు మరింత స్ఫూర్తి నిచ్చింది అని, ఈ స్పూర్తితో ఉద్యమ్మని మరింత ముందుకు తీసుకెళ్తామని అమరావతి రైతులు సంకల్పించారు.

★ అధికార పార్టీ నుంచి ఎప్పుడు వేధింపులు, అక్రమ అరెస్టులు జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీ నారా లోకేష్ మరియు టీడీపీ నాయకులు వెంటనే స్పందిస్తూ వెన్నంటే ఉంటూ అన్నివిధాలుగా మద్దతుగా నిలిచారన్నారు.

★ అలాగే జగన్ రెడ్డి, కొడాలి నాని చేసిన ఫేక్ ప్రసంగలపై నిప్పులు చెరిగారు.

★ దీక్షా శిబిరాల్లోని వారు కూడా ఈ కార్యక్రమం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇదే విషయం ఈ కార్యక్రమానికి కారకులైన ప్రతి ప్రవాసాంధ్ర మిత్రులకూ తెలియజెసి కృతజ్ణతలు తెలియ చెయ్యమన్నారు.

ఈ సందర్బంగా తెలుగు మహిళ నాయకురాలు, మూల్పూరి సాయి కల్యాణి మాట్లాడుతూ..

★ నేను ఇప్పటివరకు గత సంవత్సర కాలంగా ఎన్నో సార్లు రాజధాని గ్రామాలు సందర్శించాను. ఉద్యమంలో పాల్గొన్నాను.

★ కానీ ఈరోజు ఇంతకుముందు కంటే ఎక్కువ భావోద్వేగానికి గురయ్యాను.

★ దానికి కారణం …. మేము సన్మానం చేసేటప్పుడు, పాద పూజ చేసేటప్పుడు ఆ పెద్దల కళ్ళల్లో నీళ్లు, వారి ముఖాల్లో భావోద్వేగం చూసి నేను కూడా అదే అనుభూతికి లోనయ్యాను.

★ ఈ కార్యక్రమ బాధ్యతను మాకు అప్పగించిన పెద్దలు కోమటి జయరాం గారికి, సతీష్ వేమన గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

ఈ సందర్భంగా ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు, శ్రీ కొలికపుడి శ్రీనివాసరావు మాట్లాడుతూ..

★ అమరావతి రాజధాని ఉద్యమానికి అమెరికాలో ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ విభాగం తరుపున తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం, సతీష్ వేమన మిత్రబృందం, తమ వంతు మద్దతు తెలుపుతు అమరావతి రైతులకు 2 వేలు ఆకుపచ్చ కండువాలు పంచినందుకు, శాలువలతో సత్కరించి పాదపూజలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

★ అలాగే, త్వరలో రాజధాని ఉద్యమంలో స్వయంగా పాల్గొనవాలిసిందిగా కోరారు.

అమెరికా ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ విభాగం, తానా మాజీ అధ్యక్షులు, కోమటి జయరాం, సతీష్ వేమన సందేశం..

★ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాజధానికి, తమ భూములు ఇచ్చిన అమరావతి రైతుల త్యాగాలు వెలకట్టలేనివి..

★ అమరావతి రాజధాని ఉద్యమంలో రైతులు, ఉద్యమకారులు చేసే ప్రతి ఉద్యమానికి మా సంపూర్ణ మద్దతు అన్నివేళలా ఉంటుందని తెలియ చెయ్యడం జరిగింది.

★ ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అమెరికా ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ విభాగం, తానా మాజీ అధ్యక్షులు, శ్రీ కోమటి జయరాం, శ్రీ సతీష్ వేమన మిత్ర బృందానికి మరియు తెలుగు మహిళ నాయకురాలు శ్రీమతి మూల్పూరి సాయి కల్యాణికి అమరావతి యువజన జేఏసీ కన్వీనర్, రాయపాటి సాయి కృష్ణ, పెద్దలు గుమ్మడి రామకృష్ణ, పర్వతనేని రత్నశ్రీ, యార్లగడ్డ శాంతి, తుమ్మల సత్య, పెందుర్తి శ్రీకాంత్ తదితరులు ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles