ఎన్టీఆర్ సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో చంద్రన్న క్రీస్మస్ కానుక
వివరాల్లోకి వెళితే ఈరోజు నెల్లూరు జిల్లా పొదలకూరు మున్సిపాలిటీ లో పని చేసే వాళ్ళకి పాదరక్షకులు, బియ్యం,నిత్య సరుకులు చంద్రన్న క్రిస్మస్ కానుకగా అందించడం జరిగింది అని ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు చుండు బాల రెడ్డయ్య నాయుడు గారు, ఉపాధ్యక్షులు షేక్ సుభాన్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు నరసింహులు యాదవ్ గారు, కలగట్ల సందీప్ పాల్గొన్నారు.






